పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై పవన్ ఫాన్స్ లో ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. అకీరా కి 18 ఏళ్ళు వచ్చేసాయి.. హీరోగా తెరంగేట్రం ఎప్పుడు అంటూ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. కానీ అకీరా నందన్ హీరోకన్నా ముందే మ్యూజిక్ డైరెక్టర్ గా షార్ట్ ఫిల్మ్ తో ఎంట్రీ ఇచ్చేసాడు. అకీరా నందన్ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది హీరోగా కాకుండా తండ్రి సినిమాతో అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పవన్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG చిత్రంలో పవన్ టీనేజర్, కాలేజ్ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్‌గా మూడు వేరియేషన్స్‌లో కనిపించనున్నారట. ఆ 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్‌ను పవన్ కొడుకు అకీరా నందన్‌తో చేయించాలని డైరెక్టర్ సుజిత్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే సుజిత్ ఇంకా పవన్ కళ్యాణ్ ని అకీరా విషయమై సంప్రదించలేదని తెలుస్తోంది. నిజంగా పవన్ గనుక ఈ ప్రపోజల్‌కు ఒప్పుకుంటే అకీరాకు OG నే డెబ్యూ మూవీ అవుతుంది.
ఇది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ కాక ఇంకేముంటుంది. తండ్రి సినిమాతో వారసుడు తెరంగేట్రం అంటే మాములు విషయం కాదు కదా. అదే జరిగితే పవన్ ఫాన్స్ కి మెంటలెక్కిపోవడం ఖాయ.