Advertisementt

పబ్లిక్ లోనే రాఘ‌వ్-ప‌రిణీతి జంట

Thu 04th May 2023 12:05 PM
parineeti chopra,raghav chadha  పబ్లిక్ లోనే రాఘ‌వ్-ప‌రిణీతి జంట
Raghav-Parineeti couple in IPL match పబ్లిక్ లోనే రాఘ‌వ్-ప‌రిణీతి జంట
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ కి చేరడానికి పరిణీతి చోప్రా చెయ్యని ప్రయత్నం లేదు. వరస సినిమాలు చేసినా అదృష్టం వరించడమే లేదు. సిస్టర్ ప్రియాంక చోప్రా మాత్రం టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే  ఈమధ్యన పరిణీతి చోప్రా ఢిల్లీకి చెందిన అధికార పార్టీ ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను ప్రేమిస్తుంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. కొన్నాళ్ళు ఈ జంట సీక్రెట్ గానే డేటింగ్ చేసినా ప్రస్తుతం పబ్లిక్ కి తమ రిలేషన్ తెలిసేలా బిహేవ్ చేస్తుంది. కారణం త్వరలోనే పరిణీతి-రాఘవ్ లు పెళ్లి పీటలెక్కబోతున్నారట.

రీసెంట్ గానే ఈ జంట ఓ హోటల్‌కు డిన్న‌ర్ డేట్‌కు వ‌చ్చిన‌ప్పుడు వీరి డేటింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పటికే రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రాల‌కు పంజాబీ సాంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగే రోకా ఫంక్ష‌న్ జ‌రిగిందని తెలుస్తుంది. అంతేకాకుండా మే 13న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో వీరి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరిగిపోతున్నాయట.

ప్రస్తుతం నిశ్చితార్ధం చేసుకున్న పెళ్లి మాత్రం అక్టోబర్ లో ఉంటుంది అని తెలుస్తోంది. పరిణీతి కానీ రాఘవ్ కానీ పెళ్లి విషయాలేవీ మాట్లాడాపోయినా.. పబ్లిక్ గా ఐపీఎల్ మ్యాచ్ జ‌రిగిన పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో హ‌ల్ చ‌ల్ చేసింది. రాఘ‌వ్‌తో తానున్న ఫొటోల‌ను పరిణీతి స్వయంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంటే ఇకపై సీక్రెట్ ఏమి లేదు అంతా పబ్లిక్ అని ఈ జంట చెప్పకనే చెప్పేసిందిగా.!

Raghav-Parineeti couple in IPL match:

Parineeti Chopra-Raghav Chadha enjoy IPL match in Mohali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ