కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో రెండో మూవీగా తెరకెక్కుతున్న NTR30 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించిన కొరటాల ఇప్పుడు మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ కి వైఫ్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయినటువంటి సీనియర్ యాక్టర్ మణి చందన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లిగా NTR30 నటిస్తున్నారు. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుంది. జాన్వీకి తల్లిగా సీరియల్ నటి మణి చందన NTR30 సెట్స్ లోకి ఎంటర్ కాబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.