Advertisementt

NBK108 లో మేజర్ హైలెట్ అదే!

Thu 04th May 2023 09:41 PM
nbk108  NBK108 లో మేజర్ హైలెట్ అదే!
The major highlight in NBK108! NBK108 లో మేజర్ హైలెట్ అదే!
Advertisement
Ads by CJ

అఖండ మరియు వీరసింహారెడ్డి వరుస విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 చేస్తున్నారు. తారకరత్న ఇష్యూతో షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చిన బాలయ్య బాబు ప్రస్తుతం #NBK108 షూటింగ్ లో బిజీగా వున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ సాంగ్ లో బాలయ్య, శ్రీలీల కనిపించారు. ఇప్పుడు #NBK108 నుండి మరో పవర్ ఫుల్ అప్ డేట్ బయటికి వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ అనేలా ఇంటర్వెల్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ ఇంటర్వెల్ బ్లాక్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, బాలయ్య మాస్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని అనిల్ రావిపూడి ఈ ఇంటర్వెల్ బ్లాక్‌ ని డిజైన్ చేసాడని అంటున్నారు. ఈ ఇంటర్వెల్ బ్లాక్‌ లో బాలయ్య తో పాటుగా కీలక పాత్రలో కనిపించనున్న శ్రీలీల కనిపిస్తారని, వీరి మధ్యన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తుంది.

బాలయ్య డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్ 20 నాటికి పూర్తి చేసి దసరాకి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బాలయ్య చిత్రాలలో రికార్డ్ ధరకు NBK108 చిత్ర OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.

The major highlight in NBK108!:

Powerful update on NBK108

Tags:   NBK108
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ