అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబోలో క్రేజీ మూవీగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఉగ్రం మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి కాగా.. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా వీక్షిస్తూనే ఉగ్రం ఇలా ఉంది, అలా ఉంది అంటూ తమ ఒపీనియన్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అల్లరి నరేష్ ఉగ్రం లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అయితే ఉగ్రం ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. ఉగ్రం సినిమా ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. స్టార్టింగ్ అంతా బాగుంది. మొదటి భాగం మొత్తం ఆసక్తికరమైన కథాంశంతో సాగుతుంది.
అల్లరి నరేష్ మాత్రం నట విశ్వరూపం చూపించాడు. ఉగ్రం ఎక్స్‌లెంట్ మూవీ.. కానీ డల్ రొమాంటిక్ ట్రాక్‌తో పాటు వెంట వెంటనే వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు వర్కౌట్ కాలేదు. స్లోగా సాగే ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో, మిస్టరీని చేధించే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అల్లరి నరేష్ క్లైమాక్స్ లో ఇరగదీసినా.. డైలాగ్ డెలివరీ విషయంలో కొన్ని సీన్స్ లో సింక్ కాలేదనే అభిప్రాయాలని ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా ఫ్లోను ఇబ్బంది పెట్టిన పాటల ప్లేస్‌మెంట్‌ను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది. విజయ్ కనకమేడల అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్, డల్ రైటింగ్ ఫ్లోను నాశనం చేశాడు. ఫైనల్ గా అల్లరి నరేష్ పెరఫార్మెన్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే అంటూ ప్రేక్షకులు ఓవరాల్ గా తమ టాక్ తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు.