బ్రహ్మానందం కమెడియన్ గా టాప్ పొజిషన్ లో కొన్నేళ్లు సినిమా ఇండస్ట్రీని శాసించారు. బ్రహ్మి లేకుండా ఏ హీరో సినిమా చేసేవారు కాదు. ఖచ్చితంగా బ్రహ్మానందం రోల్ లేకుండా దర్శకులు కథ రాసేవారు కాదు. కానీ కొన్నాళ్లుగా ఆయన హెల్త్ ఇష్యుస్, అలాగే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. రీసెంట్ గా మళ్లీ సినిమా అవకాశాలతో బిజీ అవుతున్న తరుణంలో బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాతో అందరిని ఏడిపించేసారు. అందరిని నవ్వించే బ్రహ్మి ఆ చిత్రంలో ప్రతి ప్రేక్షకుడిని తన నటనతో కంటతడి పెట్టించారు.
సినిమా అవకాశాలతో, షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న బ్రహ్మానందం ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. పాలిటిక్స్ కి దూరంగా ఉండే బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అందరికి షాకిచ్చింది. చిక్ బళ్లాపూర్ బీజేపి అభ్యర్థి సుధాకర్ కి మద్దతుగా బ్రహ్మి ప్రచారం చేస్తున్నారు. సుధాకర్ ని గెలిపించమంటూ బ్రహ్మానందం ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే బ్రహ్మి ఇలా సడన్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం ఆయన అభిమానులకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.