కొరటాల శివ ఎన్టీఆర్ తో #NTR30 షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండి రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు. ఆచార్య డిసాస్టర్ నుండి బయటపడి ఆరు నెలలు #NTR30 స్క్రిప్ట్ పై కూర్చుని ఫుల్ స్క్రిప్ట్ తో #NTR30 సెట్స్ లోకి అడుగుపెట్టిన కొరటాల ఓపెనింగ్ తోనే అందరిలో ఆసక్తిని అంచనాలను క్రియేట్ చేసారు. జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చెయ్యడం.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని బాలీవుడ్ నుండి తీసుకురావడం, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి క్రేజీ నటులని #NTR30 లో భాగం చెయ్యడం ఇలా ప్రతి విషయంలో స్పెషలిటీని చూపించారు.
కానీ ఇప్పుడు కొరటాల ఎంపిక చేస్తున్న నటీమణులతో కొరటాలపై సోషల్ మీడియాలో సీరియల్స్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కి వైఫ్ పాత్ర కోసం ఏ క్రేజీ యాక్ట్రెస్ నో తీసుకుంటే బావుండేది కానీ.. సీరియల్స్ లో నటించే కన్నడ అమ్మాయి చైత్ర రాయ్ ని ఎంపిక చెయ్యడం అందరికి షాకిచ్చింది. అది సరే.. ఇప్పుడు జాన్వీ కపూర్ కి మథర్ రోల్ కోసం కూడా కొత్త అమ్మాయిని తీసుకోవాల్సింది పోయి.. మరో సీరియల్ నటిని ఎంపిక చెయ్యడమే కొరటాలపై ఈ రకమైన కామెంట్స్ కి తావిచ్చింది.
జాన్వీ కపూర్ తల్లిగా మణి చందన అనే సీరియల్ ఆంటీని కొరటాల ఎంపిక చేశారట. అటు చైత్ర రాయ్, ఇటు మణి చందన ఇలా సీరియల్ నటులని పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం కొరటాల ఎంపిక చెయ్యడంతో అయ్యా కొరటాల శివ గారు మీరు సినిమా తీస్తున్నారా.. లేదంటే సీరియల్ చేస్తున్నారా, సీరియల్స్ లో వాళ్ళు మంచి నటీమణులైతే కావొచ్చు, కానీ సిల్వర్ స్క్రీన్ మీద, అందులోను పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి వాళ్ళని తీసుకురావడం ఏమిటండి అంటూ కొరటాలని ఆడేసుకుంటున్నాడు.