శక్తి సినిమాతో 32 కోట్ల నష్టం చవి చూసిన అశ్విని దత్ ఆ విషయాన్ని ఇప్పటికి మర్చిపోవడం లేదు. అది మర్చిపోయే విషయమా. ఒక కోటి కాదు, రెండు కోట్లు కాదు ఏకంగా 32 కోట్లు అంటే ఆ మాత్రం బాధ ఉండడం సహజమే. గతంలోనూ ఆయన ఎన్టీఆర్-మెహెర్ రమేష్ తో చేసిన శక్తి తో కోట్లు పోగొట్టుకున్నట్టుగా చెప్పి ఆ దెబ్బకి సినిమాలకు కొన్నాళ్ళు విరామం తీసుకున్న విషయాన్నీ రివీల్ చేసారు. తాజాగా ఓ సందర్భంలో మరోసారి శక్తి నష్టాల గురించి మాట్లాడారు.
గతంలో అంటే ఆ రోజుల్లో సినిమాల పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువలన లాభం వచ్చినా, నష్టం వచ్చినా వారే భరించేవారు. నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఇళ్లు, పొలాలు అమ్ముకున్నవారిని నేను చాలామందిని చూశాను. అలాంటివారిని చూసినప్పుడు నాకు భయం వేసేది. మరింత జాగ్రత్తగా ఉండాలనిపించేది.
కానీ నేను కూడా ఎన్టీఆర్ తో చేసిన శక్తి వలన చాలా నష్టపోయాను. శక్తి బడ్జెట్ పరిమితి దాటిపోయింది, సినిమా ఆడలేదు. 32 కోట్లు నష్టం వహ్చింది. ఒక సినిమా వలన 32 కోట్లను పోగొట్టుకోవడమనేది మామూలు విషయం కాదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది అంటూ అశ్విని దత్ గారు పదే పదే శక్తి నష్టాలను గుర్తు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు.