Advertisementt

UBS: ఫుల్లీ లోడెడ్.. మళ్లీ లోడెడ్..

Fri 05th May 2023 09:30 PM
ustad bhagat singh  UBS: ఫుల్లీ లోడెడ్.. మళ్లీ లోడెడ్..
Harish Shankar says fully loaded.. malli loaded UBS: ఫుల్లీ లోడెడ్.. మళ్లీ లోడెడ్..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంటే.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరస అప్ డేట్స్ తో పవన్ ఆయన ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇస్తున్నారు. ఎప్పుడూ నెమ్మదిగా సైలెంట్ గా సినిమాలు చేస్తూ ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జోష్ తో షూటింగ్స్ చేసుకుంటూ పోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత క్రేజీ కంబోగా సెట్స్ మీదకి వెళ్ళిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదటి షెడ్యూల్ మొన్నీమధ్యనే హైదరాబాద్ లో పూర్తయ్యింది.

ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం హారిష్ శంకర్ ఏర్పాట్లు చేస్తూనే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అప్ డేట్స్ తో హల్ చల్ చేస్తున్నాడు. ఈరోజు కూడా మైత్రి మూవీస్ వారు మరో గంటలో స్పెషల్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్ అంటూ ఊరించి వెంటనే Rockstar @ThisIsDSP has some exciting news 🤩🤩 Let's celebrate a very special day with a blasting glimpse of #UstaadBhagatSingh on May 11th 💥💥 Mark the date 🔥🔥 మే 11 స్పెషల్ డే, ఆ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గ్లిమ్ప్స్ అంటూ దేవిశ్రీ వీడియో రిలీజ్ చేసారు.

ఆ వెంటనే హరీష్ శంకర్ ఫుల్లీ లోడెడ్.. మళ్లీ లోడెడ్.. అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. ఈ చిన్న చిన్న అప్ డేట్స్ తోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. మే 11న స్పెషల్ గ్లిమ్ప్స్ వస్తే సోషల్ మీడియా షేకేనేమో..!

Harish Shankar says fully loaded.. malli loaded:

Ustad Bhagat Singh special update

Tags:   USTAD BHAGAT SINGH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ