Advertisementt

షూటింగ్ షురూ చేసిన పుష్ప 2

Sat 06th May 2023 10:37 AM
pushpa 2  షూటింగ్ షురూ చేసిన పుష్ప 2
Pushpa 2 has started shooting షూటింగ్ షురూ చేసిన పుష్ప 2
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో క్రేజీ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా, సూపర్ హిట్ పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ మూవీ షూటింగ్ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని మల్కన్ గిరి ఫారెస్ట్ లో జరుగుతున్న సమయంలో సుకుమార్, పుష్ప మేకర్స్ పై జరిగిన ఐటి దాడులతో పుష్ప షూటింగ్ పక్కనబెట్టి హైదరాబాద్ కి వచ్చేసింది టీమ్. ఇక ఐటీ దాడుల ఇష్యు ముగియడంతో మళ్ళీ సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లిపోయారు.

ఇప్పటికే మల్కన్ గిరి ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో కలెక్టర్ అనుమతులు తీసుకుని షూటింగ్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఒడిస్సాలోని కలిమెలి సమితి మన్యంకొండ పంచాయతీలోని పొల్లేరు గ్రామాన్ని సుకుమార్ టీం సందర్శించి పుష్ప 2 కి లొకేషన్స్ సెట్ చేసుకుంటుంది. మల్కన్ గిరి ప్రకృతి సౌందర్యాలకు పెట్టింది పేరు.. ఇక్కడే పుష్ప 2 షూటింగ్ చేస్తున్నట్టుగా సుకుమార్ చెప్పారు. పొల్లేరు ప్రాంతంలో మరో రెండు నెలల్లో పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్ట్ 2 లోకి జగపతి బాబు లాంటి మేటి నటులు యాడ్ అవుతున్నారు. పుష్ప భారీ విజయం సాధించడంతో పార్ట్ 2 పై అంచనాలు అంతకంతకు రెట్టింపవుతున్నాయి. 

Pushpa 2 has started shooting:

Pushpa 2 shooting update

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ