Advertisementt

విరూపాక్ష ఓటిటి డేట్ లాక్

Sat 06th May 2023 09:46 PM
sai dharam tej,virupaksha  విరూపాక్ష ఓటిటి డేట్ లాక్
Virupaksha OTT date locked విరూపాక్ష ఓటిటి డేట్ లాక్
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్-సంయుక్త మీనన్ కాంబోలో కార్తీక్ దండు తెరకెక్కించిన విరూపాక్ష ఏప్రిల్ 21 న విడుదలై ప్రస్తుతం మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో హిట్ రివ్యూస్ తో దుమ్మురేపిన విరూపాక్ష ఓటిటి రిలీజ్ పై విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది. ప్రస్తుతం 90 కోట్ల మార్క్ ని టచ్ చెయ్యబోతున్న విరూపాక్ష తమిళ, మలయాళ, హిందీ లాంగ్వేజెస్ లో నిన్న శుక్రవారమే రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. 

అయితే ఈ చిత్రం ఓటిటి లో ఎప్పుడొస్తుంది.. అనే ఆత్రుత ఆడియన్స్ లో ఎక్కువైపోతోంది. ఈ మధ్యన బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా విడుదలైన నెలలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇక డిసాస్టర్ మూవీస్ మూడు వారాలు తిరిగేలోపులోనే ఓటిటికి వచ్చేస్తున్నాయి. దానితో విరూపాక్ష కూడా నెలకే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ కాదు మే 20నే ఓటిటిలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. 

విరూపాక్ష డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ నుండి ఈ నెల 20 న విరూపాక్ష ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన అవకాశం ఉంది అంటున్నారు.

Virupaksha OTT date locked :

Sai Dharam Tej Virupaksha OTT date locked 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ