Advertisementt

పరశురామ్ పై నెగిటివిటీ స్టార్ట్

Sun 07th May 2023 10:04 AM
naga chaitanya,parasuram  పరశురామ్ పై నెగిటివిటీ స్టార్ట్
Negativity starts on Parashuram పరశురామ్ పై నెగిటివిటీ స్టార్ట్
Advertisement
Ads by CJ

గీత గోవిందం తో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి చేరిన దర్శకుడు పరశురామ్ తర్వాత స్టార్ హీరో మహేష్ సర్కారు వారి పాట చేసాడు. ఆ చిత్రం సో సో రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. అయితే పరశురామ్ 14 రీల్స్ బ్యానర్ లో నాగ చైతన్యతో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది. అది అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ పరశురామ్ నాగ చైతన్యని పక్కనబెట్టి మహేష్ తో సినిమా చెయ్యడమే కాకుండా ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ-దిల్ రాజు తో సినిమా ప్రకటించాడు.

అసలు నాగ చైతన్యతో సినిమా ఊసే తియ్యలేదు. తాజాగా నాగ చైతన్య కూడా పరశురామ్ తో మూవీ టాపిక్ రాగానే ఆ దర్శకుడు గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అంటూ తేల్చేసాడు. నా టైమ్ ఆయన చాలా వేస్టు చేశాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం వలన మీ టైమ్ .. నా టైమ్ వేస్టు అవుతుంది అంటూ చెప్పడంతో పరశురామ్ పై నెగిటివిటి మొదలైంది. ఇకపై పరశురామ్ తో ఎవ్వరు సినిమా చెయ్యాలన్నా ఆలోచిస్తారు, మాటిచ్చి తప్పడం ఎంతవరకు కరెక్ట్.

మహేష్ ప్రాజెక్ట్ కోసం చైతూని పక్కనపడేసాడు. తర్వాత విజయ్ తో సినిమా ప్రకటించాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయితే ఏం చేసినా చెల్లుతుందనా.. అంటూ నెటిజెన్స్ కూడా పరశురామ్ బిహేవియర్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Negativity starts on Parashuram:

Naga Chaitanya makes sensational comments on Parasuram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ