యాంకరింగ్ కి అనసూయ గ్లామర్ ని పరిచయం చేస్తే.. శ్రీముఖి మాత్రం తన వాయిస్ పవర్ తోనే అందిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రెజెంట్ టాప్ పొజిషన్ కి చేరుకుంది. సిల్వర్ స్క్రీన్ మీద కలిసి రాకపోయినా.. బుల్లితెరని మాత్రం తన యాంకరింగ్ తో ఏలుతుంది. కొద్దిరోజుల క్రితం బబ్లీగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు మాత్రం కాస్త స్లిమ్ గా మారడమే కాదు.. అందాలు చూపించడంలో హద్దులు చెరిపేసింది.
ప్రముఖ ఛానల్స్ అన్నిటిలో శ్రీముఖి యాంకరింగ్ మాత్రమే కనిపిస్తుంది. సుమ స్పెషల్ షోస్ కి పరిమితమవుతుండగా.. అనసూయ యాంకరింగ్ కి బై బై చెప్పేసి వెండితెర మీద వెలిగిపోవడం, రష్మి కూడా కేవలం జబర్దస్త్ కే పరిమితమవడంతో శ్రీముఖికి టైమ్ బాగా కలిసొచ్చి ఇప్పుడు టాప్ యాంకర్ గా చక్రం తిప్పుతూ గ్లామర్ చూపిస్తుంది.
బుల్లి బుల్లి డ్రెస్సులతోనే శ్రీముఖి సోషల్ మీడియాని ఊపేస్తోంది. సమయం చిక్కినప్పుడల్లా గోవాలో ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే శ్రీముఖి తాజాగా బ్యాంకాక్ లో తేలింది. బ్యాంకాక్ లో డే1 అంటూ కన్నుకొట్టి మరీ తాను దిగిన హోటల్ నుండి సెల్ఫీలు తీసుకుని తన ఎంజాయ్మెంట్ ఎలా ఉందో చూపించేసింది. అలా శ్రీముఖి కన్నుకొట్టడంతో బ్యాంకాక్ వెళ్లి మరీ కన్ను కొడుతున్న శ్రీముఖి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.