ద కేరళ స్టోరి విడుదలకు ముందు, విడుదల తర్వాత పెను సంచలనం సృష్టించిన సినిమా. ఆదా శర్మ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. విడుదలకు ముందే వివాదాలకు కేరాఫ్ గా మారి ఎవరి నోట చూసినా ద కేరళ స్టోరీ కబుర్లే. కేరళ స్టోరీని బ్యాన్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు. కేరళ స్టోరీ చుట్టూ రాజకీయాలు. కేరళ స్టోరీని విడుదల చెయ్యనివ్వమంటూ పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనలు చేసినా ఎట్టకేలకి గత శుక్రవారం సినిమా విడుదలైంది. కేరళ స్టోరీ సినిమా ఎలా ఉంది అనే కన్నా ఏయే రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకున్నారో అనే విషయంలోనే తెగ సస్పెన్స్ క్రియేట్ అయ్యింది.
కేరళలో ఇప్పటికే ఈ చిత్రంపై నిరసనలు వెల్లువెత్తాయి. కేరళలోనే కాదు.. తమిళనాడులోనూ ఈ సినిమాకి వ్యతిరేఖంగా నిరసన జ్వాలలు అలుముకున్నాయి. అందులో భాగంగానే తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్స్ లో కేరళ స్టోరీ షోస్ ఆపేసారు. ప్రదర్శనలు లేవు. చెన్నై లాంటి ప్రముఖ నగరాల్లో ఉన్న మల్టిప్లెక్స్ థియేటర్స్ లో కేరళ స్టోరీని ప్రదర్శనలు నిలిపివేశారు.
కేరళ స్టోరీకి వ్యతిరేఖంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కార్టీసి పార్టీ చెన్నైలో ఆందోళనలు నిర్వహించి థియేటర్స్ లో ప్రవేశించి సినిమాని ఆపేయ్యాలంటూ ధర్నాలు చేపట్టి యాజమాన్యాన్ని షోస్ ఆపేయాలని, ప్రేక్షకులని సినిమాని వీక్షించొద్దని విజ్ఞప్తులు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి భద్ర దృష్యా మల్టిపెక్స్ యాజమాన్యంతో మాట్లాడి కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనలు నిలిపివేశాయి.