యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 లో శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTR31 చెయ్యాల్సి ఉంది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని కూడా తనదైన మాస్ స్టయిల్లోనే ప్రెజెంట్ చేయబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ లోనే చూపించారు.
అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్ ని ఎన్టీఆర్ కి జోడిగా తీసుకొచ్చే ప్లాన్ లోనే ప్రశాంత్ నీల్ ఉంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగింది. ఈ సౌత్ హీరోయిన్స్ ఎన్టీఆర్ పక్కన ఆనరని తెలుసు. అందుకే బాలీవుడ్ హీరోయిన్ పైనే ఆయన ఫోకస్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ప్రశాంత్ నీల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ నటిస్తుంది అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి.
గతంలో దీపికా పేరు వినిపించింది. అప్పుడు ఫ్యాన్స్ ఓకే అన్నా ఇప్పుడు శ్రద్ద కపూర్ పేరు వినగానే టెన్షన్ పడిపోతున్నారు. ప్రభాస్ పక్కన సాహోలో నటించిన శ్రద్ద అందాలు తెలుగు ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు. ఆమె పల్చగా కనిపిస్తుంది. గ్లామర్ గా కనిపించినా ఆ అందాలు ఎక్స్పోజ్ అవ్వవని ఎన్టీఆర్ ఫాన్స్ తెగ బాధపడిపోవడం కాదు.. మాకొద్దు అబోయ్ ఆ హీరోయిన్ అంటూ గోల మొదలు పెట్టేసారు.