నాగ చైతన్య ఈమధ్యన కష్టడి ప్రమోషన్స్ లో సమంతతో విడాకుల విషయంపై మొదటిసారిగా ఓపెన్ అయ్యాడు. గతంలో తమ మధ్యన మూడో వ్యక్తిని లాగి వాళ్లపై నెగటివ్ గా రాయడమే బాధనిపించింది అంటూ నాగ చైతన్య అన్నాడు. అంటే నాగ చైతన్యకి-శోభిత దూళిపాళ్ళకి లింక్ పెట్టి మీడియా ప్రచారం చేస్తుంది అనేది ఆయన మీనింగ్. కానీ నాగ చైతన్య-శోభితలు లండన్ వెళ్లడమే కాకుండా ఒకే హోటల్ లో కనిపించడం, గతంలోనూ వీరిద్దరూ కలిసి కనిపించడంతో చైతూ శోభితతో డేటింగ్ లో ఉన్నాడనుకున్నారు.
ఇక మూడో వ్యక్తి అంటూ చైతూ శోభితనే సంబోదించాడని అందరూ అనుకుంటున్న సమయంలో శోభిత దూళిపాళ్ల నాగ చైతన్యతో డేటింగ్ విషయంలో ఆయన పేరెత్తకుండానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈమధ్యనే మణిరత్నం గారితో పొన్నియన్ సెల్వన్ మూవీ చేశాను. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నాను, పొన్నియన్ సెల్వన్ లో రెహ్మాన్ సంగీతానికి డాన్స్ చెయ్యడం బాగా నచ్చేసింది. ఇంతమంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని ఫీలవ్వాల్సిన పని లేదు.
ఆ రూమర్ తో నాకు పని లేదు. నేను ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు అర్జెంట్ గా వెళ్లి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చెయ్యనప్పుడు కంగారు పడాల్సిన పని లేదు, దానిపై స్పందించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను అంటూ శోభిత చైతూ తో డేటింగ్ విషయంపై ఇండైరెక్ట్ గానే ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసింది.