శుక్రవారం వస్తే కొత్త సినిమాల సందడి థియేటర్స్ లోను, థియేటర్స్ లో విడుదలైన హిట్ అండ్ ప్లాప్ మూవీస్, కొత్త కొత్త వెబ్ సీరీస్ లు పలు రకాల ఓటిటీలలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అటు యూత్ థియేటర్స్ కి పరుగులు తీస్తే ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ఓటిటీల్లో సినిమాలెమోస్తున్నాయో అని తెగ వెతికేస్తారు. మరి వారం వారంలా ఈ శుక్రవారం విడుదల కాబోయే థియేటర్స్ మూవీస్ ఏమిటో చూసేద్దాం.
తెలుగు, తమిళ భాషల్లో నాగ చైతన్య-కృతి శెట్టి.. హీరో-హీరోయిన్స్ గా తెరకెక్కిన కష్టడి మే 12 న థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దానితో పాటుగా శ్రీయ శరన్ మ్యూజిక్ స్కూల్ కూడా థియేటర్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. అలాగే ఆ మే 12 శుక్రవారమే భువన విజయం, కల్యాణ మస్తు చిత్రాలు విడుదలవుతుండగా తెలుగు హీరో బెల్లంకొండ నటించిన హిందీ ఛత్రపతి కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ వారం ప్రముఖ ఓటిటీల నుండి రాబోతున్న చిత్రాలు, పలు వెబ్ సీరీస్ ల వివరాలు మీ కోసం..
ఆహా: న్యూసెన్స్ (తెలుగు సిరీస్) - మే 12
నెట్ ఫ్లిక్స్: ద మదర్ (ఇంగ్లీష్ మూవీ), తిరువిన్ కురల్ (తమిళ సినిమా) - మే 12
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
సొప్న సుందరి (తెలుగు డబ్బింగ్ సినిమా) కార్టర్ (ఇంగ్లీష్ మూవీ) - మే12
జీ 5: సండకోళి (తమిళ సిరీస్) మే 8 స్ట్రీమింగ్ అవుతోంది
సోనీ లివ్: ట్రైయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12
అమెజాన్ ప్రైమ్ వీడియో: ఎయిర్ (ఇంగ్లీష్ మూవీ) దహాద్ (హిందీ సిరీస్) - మే 12