జబర్దస్త్ వదిలేసాక సినిమాలు చేసుకుంటూ కనిపిస్తున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టీవ్ గా ఉంటుంది. అందమైన ఫొటోస్ ని షేర్ చెయ్యడమే కాదు.. తనేం చెప్పాలనుకుంటుంది అది చాలా స్ట్రయిట్ గా చెబుతుంది. అలాగే తనపై నెగిటివిటి చూపించేవారి తాట తీస్తుంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఫాన్స్ తో మరోసారి అనసూయ పెట్టుకుంది. గతంలోనూ రౌడీ ఫాన్స్ తో లొల్లి పెట్టుకున్న అనసూయ ఇప్పుడు మరోమారు వివాదాన్ని కొని తెచ్చుకుంది.
ది దేవరకొండ అంటూ విజయ్ దేవరకొండ పేరు ముందు పెట్టుకోవడం అనసూయకి నచ్చక ది పై ఇండైరెక్ట్ గా కామెంట్ చెయ్యడంతో రౌడీ ఫాన్స్ అనసూయని అనరాని మాటలంటూ చెలరేగిపోతున్నారు. వారందరికీ ధీటుగా సమాధానం చెబుతుంది అనసూయ. అయినా అనసూయని వాళ్ళు వదలడం లేదు. దానితో అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ పెట్టింది.
నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను 😄
నా పెంపకం గర్వించతగింది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది.. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధంచేసుకోండి.. 🙂🙏🏻
Shame the Abuser.. not the abused. Period. నీ పెంపకం బాలేదు.. నా పెంపకం బావుంది అంటూ ఈసారి ఎవరి పేరు ఇండైరెక్ట్ గా కూడా ఎత్తకుండానే పోస్ట్ పెట్టింది. ఇది కూడా రౌడీ ఫాన్స్ ని ఉద్దేశించే అన్నది అంటూ వారు మరోసారి అనసూయపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా చూసిన నెటిజెన్స్.. అనసూయ ఇక ఈ లొల్లి ఆపవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.