Advertisementt

కస్టడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్

Fri 12th May 2023 08:52 AM
custody overseas premiers talk  కస్టడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్
Custody Overseas Premiers Talk కస్టడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ కస్టడీ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కి నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య సింగిల్ హ్యాండ్ ప్రమోషన్స్, స్టార్ కాస్ట్, ట్రైలర్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. కస్టడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.. హైదరాబాద్ ఐమాక్స్ లో ప్రెస్ షో కూడా స్టార్ట్ అయ్యింది. మరి కస్టడీ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో చూసేద్దాం..

ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో కస్టడీ తెరకెక్కింది. కస్టడీ ఫస్ట్ హాఫ్ తర్వాత ఓ ఆడియెన్ స్పందన ఇలా ఉంది.. కస్టడీ మూవీ ఫస్టాఫ్ జస్ట్ ఏవరేజ్‌గా ఉంది. ఈ సినిమా చాలా నెమ్మదిగా, ఫ్లాట్‌గానే మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది. పాటలు నిరాశ పరుస్తాయి. సెకెండాఫ్ బాగుండాలి అంటూ ట్వీట్ చేసాడు. మరొక ఆడియెన్ స్పందిస్తూ.. కస్టడీ మలుపులు, ట్విస్టులతో సాగే థ్రిల్లర్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దీన్ని రియలిస్టిక్‌గా చూపించాడు. నాగ చైతన్య పెరఫార్మెన్స్ సూపర్. యాక్షన్ సీక్వెన్స్‌లో బాగా చేశాడు. అరవింద్ స్వామి చాలా మొరటుగా కనిపించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది అంటూ ట్వీటేసాడు.

మరొక ఆడియెన్ ట్వీట్ చేస్తూ.. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. సెకెండాఫ్ ఇంట్రెస్టింగ్ గా మొదలైనా అది కూడా డౌన్ అయింది. మొత్తంగా ఇది చెత్త సినిమా అని చెప్పలేం కానీ.. అంచనాలను మాత్రం అందుకోదు అంటూ స్పందించాడు. చాలా చోట్ల రిపీట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు బాలేదు అంటూ చాలామంది నెటిజెన్స్ కస్టడీ మూవీపై తమ స్పందన తెలియజేస్తున్నారు.

Custody Overseas Premiers Talk:

Naga Chaitanya Custody Premiers Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ