Advertisementt

ఫైనల్లీ ఆ హీరోయిన్ కి మంచిరోజులొచ్చాయి

Fri 12th May 2023 09:30 AM
adah sharma,the game of girgit  ఫైనల్లీ ఆ హీరోయిన్ కి మంచిరోజులొచ్చాయి
Finally, good days have come to the heroine ఫైనల్లీ ఆ హీరోయిన్ కి మంచిరోజులొచ్చాయి
Advertisement
Ads by CJ

ఆదా శర్మ హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ కి దిగుమతి అయిన హీరోయిన్. నితిన్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మకి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ఆమెకి అవి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. క్షణం, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల్లో నటించిన ఆదా శర్మ హీరోయిన్ గా సౌత్ లో నిలదొక్కుకోలేకపోయింది. కొన్నేళ్లుగా సోషల్ మీడియాకే పరిమితమైన అదా శర్మ మళ్ళీ ది కేరళ స్టోరీస్ తో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ చిత్రంలో అదా శర్మ ముస్లిం యువతిగా కనిపించింది. 

ఆ చిత్రం స్టోరీ, నేపథ్యం, అసలు సినిమా హిట్టా ప్లాపా అనేది పక్కబెడితే.. కేరళ స్టోరీపై వచ్చిన విమర్శలు, కాంట్రవర్సీల కారణంగా కేరళ స్టోరీ కి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ పలు రాష్ట్రాలు చేస్తున్న గొడవలు ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ రావడానికి కారణమవడంతో ఆటోమాటిక్ గా ఆదా శర్మ పాపులర్ అయ్యింది. దానితో ఆమెకి అవకాశాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఆదా శర్మకి హెట్ స్టోరీ 2 ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. శ్రేయాస్ తెల్సాడ్ హీరోగా నటిస్తున్న ది గేమ్ ఆఫ్ గిర్జిట్ చిత్రంలో అదా శర్మకి పోలీస్ ఆఫీసర్ పాత్ర తగిలింది. 

దీనిపై అదా శర్మ మట్లాడుతూ కమాండో చిత్రంలో ఇంతకుముందు భావన రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. అది ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రంలో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నాను.. నా పాత్ర సరదాగా, డిఫరెంట్ గా ఉంటుంది అంటూ ఆదా శర్మ తన పాత్రపై ఎగ్జైట్ అవుతుంది.

Finally, good days have come to the heroine:

Adah Sharma to play a cop in The Game of Girgit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ