Advertisementt

పరిణీతి ఇంట పెళ్లి కళ

Fri 12th May 2023 04:09 PM
parineeti chopra  పరిణీతి ఇంట పెళ్లి కళ
Parineeti Chopra House Decked పరిణీతి ఇంట పెళ్లి కళ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఎంపీ రాఘవ్ చద్దాతో తో ప్రేమలో ఉంది, సీక్రెట్ డేటింగ్ కాస్తా ఇప్పుడు అందరికి తెలిసేలా వారి ప్రేమని చూపిస్తున్నారు. గతంలో కామ్ గా కనిపించిన ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుంది. రేపు ఢిల్లీ లో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దాల నిశ్చితార్ధం గ్రాండ్ గా జరగబోతుంది.. అని తెలుస్తుంది. అందుకే ముంబైలోని పరిణీతి ఇంటిని డెకరేట్ చేశారంటున్నారు. పరిణీతి చోప్రా ఇంటి వాతావరణం చూస్తే పెళ్లి కళ వచ్చేసింది అనిపిస్తుంది.

ఈమధ్యన ఐపిల్ మ్యాచ్ లో జంటగా కనిపించిన పరిణీతి-రాఘవ్ చద్దాలు కలిసే ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ మీడియా కంటపడుతున్నారు. వీరి మధ్యన డేటింగ్ రూమర్స్ ఉన్నా ఎప్పుడూ ఎవరూ బయటపడలేదు. కానీ పెళ్ళికి రెడీ అయిన తర్వాత తరుచూ కలిసి కనిపిస్తున్నారు. ఇక రేపు శనివారం న్యూ ఢిల్లీలో నిశ్చితార్ధం చేసుకుని వచ్చే ఏడాది అక్టోబర్ లో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. 

ఢిల్లీ లో నిశ్చితార్ధం జరుగుతున్న వేళ పరిణీతి కుటుంబ సభ్యులు ఇక్కడ ముంబైలోని పరిణీతి ఫ్లాట్ ని అందంగా ముస్తాబు చేసి లైట్స్ పెట్టించడంతో పెళ్లికళ వచ్చేసినట్టుగా కళకళలాడుతుంది. పరిణీతి-రాఘవ్ ల నిశ్చితార్ధ వేడుకకి అత్యంత సన్నిహితులు, ఫ్యామిలీ మెంబెర్స్, కొద్దిమంది రాజకీయనేతలు మాత్రమే హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.  

Parineeti Chopra House Decked :

Parineeti Chopra Mumbai house decked up for engagement ceremony

Tags:   PARINEETI CHOPRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ