Advertisementt

సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న పుష్ప టీం

Fri 12th May 2023 06:41 PM
pushpa the rule  సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న పుష్ప టీం
Pushpa 2 team working silently సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న పుష్ప టీం
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ బర్త్ డే కి పుష్ప 2 నుండి స్పెషల్ వీడియో ఇచ్చాక పుష్ప టీమ్ నుండి మళ్ళీ ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. సుకుమార్ మరియు పుష్ప మేకర్స్ ఈ మధ్యన ఐటి సోదాలతో సతమతమవడంతో కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త షెడ్యూల్ తో హడావిడి మొదలు పెట్టేసాడు. ఆంధ్రలోని మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో మోతు గూడెంలో పుష్ప ద రూల్ చిత్రీకరణలో సుక్కు అండ్ టీమ్ బిజీగా ఉంది.

పుష్ప 2 కేవలం హైదరాబాద్ మారేడుమిల్లు, ఒరిస్సా ప్రాంతాలే కాకుండా విదేశాల్లోనూ చిత్రీకరించబోతున్నారట. సుకుమార్ అల్లు అర్జున్ బర్త్ డే వీడియోలోనే పుష్ప రాజ్ మలేషియా, సింగపూర్, చైనా ఇలా ఎక్కడ ఉన్నాడో అంటూ ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే. అందుకే పుష్ప టీమ్ షూటింగ్ కోసం త్వరలోనే విదేశాలకి కూడా వెళ్లబోతుందట. పుష్ప ద రూల్ లో విదేశీ టచ్ కూడా ఇచ్చి ప్రేక్షకులని మరింత సర్ ప్రైజ్ చెయ్యాలని మేకర్స్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ పై కీలక యాక్షన్ ఘట్టాలను సుకుమార్ చిత్రీకరిస్తున్నారట. మారేడుమిల్లులో షూటింగ్ పూర్తి కాగానే టీమ్ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిందట. అయితే ఏం చేసినా టీమ్ కామ్ గా అప్ డేట్ ఏమి లేకుండానే పని చేసుకుపోతుంది.

Pushpa 2 team working silently:

Pushpa The Rule Shooting update

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ