హీరోయిన్‌గా స్టార్ రేంజ్‌కి వెళ్లలేకపోయిన సదా ఈమధ్యన టీవీ షోస్‌తో బాగా హైలెట్ అవుతూ సందడి చేస్తుంది. బుల్లితెర షోస్‌లో జడ్జ్ ప్లేస్‌లో గ్లామర్‌గా మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ముంబైలో తన కాఫీ షాప్‌ని తీసెయ్యమని ఓనర్ ఒత్తిడి చేసాడని, అది తనకు ఇష్టం లేదని, దానిని చాలా కష్టపడి పైకి తీసుకొచ్చానని చెబుతూ.. దానిని వదిలెయ్యాలంటే బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే మొన్నీమధ్యనే స్టార్ మా లో BB జోడిలో రాధ, తరుణ్ మాస్టర్‌తో కలిసి జడ్జ్ ప్లేస్‌లో డాన్స్ షో లో కనిపించిన సదా.. ఆ షోలో అందాల మోత మోగించేసింది. హీరోయిన్‌గా సినిమాలు మానేసినా గ్లామర్ అవుట్ ఫిట్స్‌తో అదరగొట్టేసింది. తాజాగా జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చేసింది. రష్మీ యాంకరింగ్‌లో ఖుష్బూ -కృష్ణ భగవాన్ జడ్జ్ లుగా వస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ జడ్జ్ ప్లేస్‌లోకి సదా వచ్చి చేరింది. ఖుష్బూ ప్లేస్‌లో సదా కూర్చున్న ప్రోమో వైరల్ అయ్యింది.
అయితే రోజా, నాగబాబు వెళ్ళిపోయాక జబర్దస్త్‌లో ఇంద్రజ, కృష్ణ భగవాన్, ఖుష్బూ లే పర్మినెంట్ జడ్జెస్‌గా కనిపిస్తున్నారు. ఖుష్బూ చెన్నై నుండి హైదరాబాద్‌కి వచ్చి మరీ జబర్దస్త్ స్టేజ్ పై సందడి చేస్తుంది. కమెడియన్స్‌తో కలిసి కామెడీ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆవిడ ప్లేస్‌లో సదా రావడం బావున్నా.. ఆమె పర్మినెంటా లేదంటే జస్ట్ కొద్దిరోజుల కోసమే ఆమె వచ్చిందో తెలియాల్సి ఉంది. గతంలో సదా అదే ఈటీవీలో ఢీ డాన్స్ షో లోను శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ స్థానంలో కూర్చుంది.