గత కొన్నివారాలుగా అంటే వేసవి సెలవలు ఆరంభమైనప్పటి నుంచి.. పిల్లలంతా సెలవులని ఎంజాయ్ చెయ్యడానికి ఏదో ఒక సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించినా.. వాళ్ళని శాటిస్ ఫై చెయ్యగలిగే చిత్రాలు మాత్రం బాక్సాఫీసు దగ్గరకి రావడం లేదు. ఏప్రిల్ 21న విరూపాక్ష మూవీ రిలీజై.. సక్సెస్ సాధించిన తర్వాత విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో అద్భుతమైన హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్బుకి దగ్గరయ్యాడు.
ఇక ఆ తర్వాత వారంలో భారీ అంచనాల నడుమ విడుదలైన అఖిల్ ఏజెంట్ భారీ డిజాస్టర్ కావడం అక్కినేని ఫాన్స్‌ని ఉసూరుమనిపించింది. ఏజెంట్ ఘోరంగా ప్లాప్ అవడం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఇక ఈమధ్యలో చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఏ సినిమా కూడా సినీ లవర్స్ ని మెప్పించలేకపోతుంది. మే 5న అల్లరి నరేష్ ఉగ్రం, గోపీచంద్ రామబాణం విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కారణం హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవడంతో రెండు సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించిగా.. అందులో అల్లరి నరేష్ ఉగ్రం చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ రాగా.. గోపీచంద్ రామబాణం బాగా నిరాశపరిచింది. సరే నాగ చైతన్య కస్టడీ అయినా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అనుకుంటే.. నిన్న విడుదలైన చైతు కస్టడీ కూడా ప్రేక్షకులని డిజప్పాయింట్ చేసింది. ఇక ఈ నెల మొత్తంలో ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్న సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులు బాగా నిరాశకి లోనవుతున్నారు.