Advertisementt

భద్రాద్రి రామయ్యకి ఆదిపురుషుడి భారీ విరాళం

Sun 14th May 2023 12:31 PM
prabhas,bhadradri devasthanam  భద్రాద్రి రామయ్యకి ఆదిపురుషుడి భారీ విరాళం
Prabhas Donates RS 10 Lakh భద్రాద్రి రామయ్యకి ఆదిపురుషుడి భారీ విరాళం
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16 న విడుదల కాబోతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ పై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. ఆదిపురుష్ చిత్రం టీజర్ విషయంలో నెగిటివిటీని ఎదురున్న మేకర్స్.. ట్రైలర్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ విఎఫెక్స్ తో మ్యానేజ్ చేసేసారు. ఆదిపురుష్ 3D టీజర్ అందరికి బాగా నచ్చేసింది. ఇక ఆదిపురుష్ ప్రమోషన్స్ ని కూడా ఓం రౌత్ అండ్ టీం అయోధ్య రామమందిరం దగ్గరకి వెళ్లి అక్కడ పూజలు చేయించారు. తర్వాత హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కి వెళ్లారు. అలాగే వైష్ణవి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు ఓం రౌత్ అండ్ టి సీరీస్ అధినేత భూషణ్ కుమార్ లు. 

ఇక ఇప్పుడు ప్రభాస్ భద్రాద్రి రామయ్యకి పది లక్షల విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ స్నేహితులు యువీ క్రియేషన్స్ అధినేతలు భద్రాచలం వెళ్లి అక్కడి గుడి ఈవో ని కలిసి పది లక్షల చెక్ అందించారు. ఆదిపురుషుడుగా మోడరన్ రామగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. ఈవోకి చెక్ అందించిన యువి క్రియేషన్స్ వారు ఆదిపురుష్ సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే ఆ పది లక్షల రూపాయలని దేవస్థానం అందించే ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించమని ప్రభాస్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో యూవీ వారే విడుదల చేస్తున్నారు. జూన్ 16 న ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Prabhas Donates RS 10 Lakh :

Prabhas Donates RS 10 Lakh To Bhadradri Devasthanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ