Advertisementt

బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న అల్లరి నరేష్

Sun 14th May 2023 01:46 PM
nikhil,allari naresh  బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న అల్లరి నరేష్
Allari Naresh missed the blockbuster బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న అల్లరి నరేష్
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్ నాంది మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రం అల్లరి నరేష్ లోని సీరియస్ కోణాన్ని పరిచయం చేసింది. కామెడీ హీరో సీరియస్ పాత్రలో అద్భుతః అనిపించాడు. ఇక మధ్యలో మారేడుమిల్లు ప్రజానీకంగా అంటూ డిసాస్టర్ మూవీ చేసినా ఆ తర్వాత ఉగ్రంతో మల్లీ హిట్ అందుకున్నాడు ఉగ్ర హిట్ తర్వాత అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ తాను ఈమధ్యన పాములంటే భయపడి ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నట్లుగా చెప్పి షాకిచ్చాడు.

తనకు కథ నచ్చినప్పటికీ అందులో పాములు ఉండటంతో.. అవంటే భయపడి ఆ సినిమా చెయ్యడం నా వల్ల కాదు అని నో చెప్పాడట. అల్లరి నరేష్ కి పాములు అంటే చాలా భయమట. అందుకే ఆ కథని రిజెక్ట్ చెయ్యగా... ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కూర్చుందట. ఆ కథ చెప్పి డైరెక్టర్ ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా నరేష్ మాత్రం ఆ పాముల భయానికి నో చేప్పేసాడట.

మరి ఆ కథ నిఖిల్ నటించిన కార్తికేయ అంటున్నారు. చందు మొండేటి అల్లరి నరేష్ కి కార్తికేయ కథ చెప్పగా.. ఆయన రిజెక్ట్ చేయడంతోనే ఆ సినిమా నిఖిల్ దగ్గరకి వెళ్లడం.. ఆ కథతో కార్తికేయ చేసి దానికి సీక్వెల్ చేసి చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పాపం అలా అల్లరి ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందన్నమాట.

Allari Naresh missed the blockbuster:

Did You Know Allari Naresh Missed Nikhil Blockbuster Karthikeya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ