నాగ చైతన్య-వెంకట్ ప్రభు కాంబోలో ద్విభాషా చిత్రం కస్టడీ గత శుక్రవారమే తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కస్టడీ మూవీ విడుదలకు ముందు నాగ చైతన్యకి హిట్ పెయిర్ అయిన కృతి శెట్టి హీరోయిన్‌గా కనిపించడం.. అరవింద్ స్వామి విలన్‌గా నటించడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అయితే సినిమా విడుదలయ్యాక కస్టడీ మూవీ ఆడియన్స్‌ని అలరించడంలో ఫెయిల్ అయింది. జస్ట్ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్న కస్టడీ మూవీకి కలెక్షన్స్ కూడా అలానే డల్‌గా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. కస్టడీ మూవీని భారీ డీల్‌తో నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్‌లో కొద్దిగా డల్‌గా నటిస్తున్న ఈ మూవీ మే 12న విడుదలైతే.. ఓటిటి నుండి జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని తెలుస్తుంది. థియేటర్‌లో కస్టడీ పెరఫార్మెన్స్ చూశాక ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేయాలనేది మేకర్స్ డిసైడ్ అవుతారని తెలుస్తుంది.
‘కస్టడీ’ కథ విషయానికి వస్తే.. 1990 సంవత్సరం రాజమండ్రిలో సీఐ శివ (నాగ చైతన్య), అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) కారుని అపడంతో అతడి పేరు మారుమ్రోగుతుంది. అదేసమయంలో అతడి చిన్ననాటి స్నేహితురాలు రేవతి (క్రితి శెట్టి)ని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఆమె ఒక రోజు సమయం ఇస్తుంది. శివ పోలీస్ స్టేషన్ నుండి ఆమెని కలవడానికి వచ్చేలోపు, అతడు రాజు (అరవింద్ స్వామి) మరియు జార్జ్ (సంపత్ రాజ్) నీ అరెస్ట్ చేస్తాడు. దీంతో అతడి జీవితంలో అనుకొని మార్పులు చోటుచేసుకుంటాయి. అవేమిటో పోలీస్ ఆఫీసర్ నటరాజ్ (శరత్ కుమార్) ఎవరనేది తెరపై చూడాలి.