నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK108 చిత్రంపై క్రేజీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకి అపోజిట్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన NBK108 సెట్ లోకి ఎంటర్ అయ్యారు. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ అండ్ టీజర్ జూన్ 10 న బాలయ్య బాబు బర్త్ డే స్పెషల్ గా రాబోతుంది. బాలయ్య పవర్ ఫుల్ గా మూడు వేరియేషన్స్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్ ఫాన్స్ ని విపరీతంగా ఇంప్రెస్స్ చేసింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య ఫస్ట్ హాఫ్ లో ఎక్కువశాతం జైలు లోనే ఖైదీగా కనిపించబోతున్నారట. ఇంటర్వెల్ సీన్ లోనే బాలయ్య అసలు ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనేది పవర్ ఫుల్ ట్విస్ట్ తో అనిల్ రావిపూడి రివీల్ చేసే సన్నివేశాలు కేకపుట్టిస్తాయని.. ఈ సీన్ లో శ్రీలీల కూడా కనిపించబోతుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న NBK108 లో బాలయ్య తెలంగాణ యాసలో ఇరగదియ్యబోతున్నారట.
ఈ చిత్రం కథపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందట. బాలయ్య క్యారెక్టర్ ప్రతి వేరియేషన్ లోను వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని, ముఖ్యంగా 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ అదిరిపోతోందని టాక్ నడుస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కాజల్, శ్రీలీల ఇద్దరూ NBK108 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా చిత్రీకరణని ఫుల్ స్వింగ్ లో నడిపిస్తున్నాడు.