బాలీవుడ్ బక్కపలచని భామ అనన్య పాండే లైగర్ మూవీతో సౌత్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకుంటే .. ఆ చిత్రం ఆమెకి ఘోరమైన డిసాస్టర్ ని అందించింది. అయినా అనన్య పాండేకి ఆ చిత్రంలో ఏమైనా మంచి మార్కులు పడ్డాయా అంటే అదీ లేదు అనన్య పాండే గ్లామర్ చూడలేక చచ్చారు ప్రేక్షకులు. అనన్య పాండే మరీ బక్కగా అందాలు చూపించినా అందులో బ్యూటీ కనిపించలేదు. ఆమెని విజయ్ దేవరకొండ సరసన ఎలా తీసుకున్నార్రా బాబు.. సైజు జీరో అందలంటూ మనల్ని చావగొట్టారు అంటూ అనన్య పాండే అందాలపై కామెంట్స్ చేసారు. ఆమె ఏ లుక్ లోను అస్సలు బాలేదు.. వెదురు బద్దలా ఉన్న ఆమె అందాలని చూడలేకపోయామంటూ పెదవి విరిచారు.
అయితే తాజాగా అనన్య పాండే కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చూడగానే ఎన్టీఆర్ ఫాన్స్ లో భయాందోళనలు మొదలయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించబోతున్న NTR30లో మరో హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం ఉంది. ఆ హీరోయిన్ గా అనన్య పాండేని సెలక్ట్ చేసుకున్నారనే న్యూస్ చూసి ఫాన్స్ భయపడుతున్నారు. అయ్యో ప్లాప్ హీరోయిన్ అయినా పర్లేదు కానీ అసలు అనన్య మాకొద్దు అంటున్నారు.
ఆమె ఎన్టీఆర్ పక్కన తేలిపోతుంది. అసలు అనన్య కి ఛాన్స్ ఇవ్వొద్దు కొరటాల గారు అని బ్రతిమిలాడుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇక బాలీవుడ్ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యడానికి కొరటాల విలన్ దగ్గర నుండి హీరోయిన్ వరకు హిందీ కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ లాంటి నటులని తీసుకోచ్చారు. మరి సెకండ్ హీరోయిన్ గా అనన్యనే తీసుకొస్తారో లేదంటే ఫాన్స్ రిక్వెస్ట్ తో అలోచించి మరో ఆలోచన చేస్తారో చూడాలి.