యాక్షన్ డైరెక్టర్ బోయపాటి-స్టలిష్ హీరో రామ్ కలయికలో BoyapatiRapo అనగానే అందరిలో ఎంతో ఆసక్తి. మాస్ యాక్షన్ కి బోయపాటి పెట్టింది పేరు. ఇస్మార్ శంకర్ తో రామ్ లోని మాస్ యాంగిల్ కి ప్రేక్షకులు విజిల్స్ వేశారు. ఇలాంటి కలయికలో మూవీ అనగానే ఆటోమాటిక్ గా అంచనాలు క్రియేట్ అవుతాయి. రామ్ బర్త్ డే సందర్భంగా రామ్-బోయపాటి నుండి స్పెషల్ టీజర్ వదిలారు. ఇంతకుముందు రామ్ లుక్ ని వదిలి అందరి అటెన్షన్ సినిమాపై ఉండేలా చేసిన బోయపాటి.. ఇప్పుడు ఈ బర్త్ డే స్పెషల్ టీజర్ తో మరింత హైప్ క్రియేట్ చేసారు.
బోయపాటి మార్క్ యాక్షన్ తో టీజర్ కట్ ఉంది. ఈ స్టేట్ దాటలేనన్నావ్ దాటా.. ఈ గేటు దాటలేనన్నావ్ దాటా అంటూ మాస్ లుక్ లో రామ్ చెప్పిన ఊరమాస్ డైలాగ్ తో థమన్ ఇచ్చిన బ్యాక్ రౌండ్ స్కోర్ తో టీజర్ దుమ్మురేపింది. పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ అంతకు మించి రామ్ లోని మాస్ కోణం ఆవిష్కృతమయ్యాయి. రామ్ ముక్కుతాడుతో దున్నని పట్టుకుని నడిచొస్తుంటే రాపో అంటూ బ్యాక్ రౌండ్ లో వినిపించే సాంగ్ అబ్బో రామ్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ బోయపాటి ఆయన ఫాన్స్ కి అందించారు.
కేవలం బాలయ్య కే బోయపాటి యాక్షన్ సెట్ అవ్వుద్ది అన్నోళ్ళకీ రామ్ తో కూడా అంతకు మించి చూపించగలని ప్రూవ్ చేసేదిలా ఈ టీజర్ ఉంది. ఈ టీజర్ మధ్యలో బ్యూటీఫుల్ ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీలకి కాస్త ప్లేస్ ఇచ్చారు. ఆశ్చర్యపోతూ కనిపించిన ఆమె లుక్స్ మోడరన్ గా కనిపించగా.. రామ్ లుక్ అండ్ కేరెక్టర్ కి ఆయన ఫాన్స్ విజిల్స్ వేస్తూ థ్రిల్ అవుతున్నారు.