అందరి అభిమానుల్లో ఎన్టీఆర్ అభిమానులు వేరయా అన్నట్టుగా ఉంది వారు చేసే రచ్చ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి కేక్ కటింగ్స్, NTR30 నుండి ఫస్ట్ లుక్, టైటిల్ మాత్రం కాదు.. ఆయన నటించిన ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరు, రామ్ చరణ్, అల్లు అర్జున్ మూవీస్ ఇలానే వాళ్ళ బర్త్ డే లకి రే రిలీజ్ చేసి అభిమానులే వాటిని ఇంకా ఇంకా హిట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల వంతు. మే 20 న సింహాద్రి ని ఎన్టీఆర్ అభిమానులే రీ రిలీజ్ చేస్తున్నారు. ఆదిని మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు సింహాద్రి మూవీకి హైప్ తీసుకురావడానికి నెక్స్ట్ లెవెల్ ఆలోచనలు చేస్తున్నారు. అంటే రీ రిలీజ్ ప్రీ రిలీజ్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. మరో మూడు రోజుల్లో సింహాద్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఎన్టీఆర్ ఫాన్స్ ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఏ సినిమా అయినా మాములుగా రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని అభిమానుల మధ్యన నిర్వహించడం చూసాం.
కానీ రీ రిలీజ్ కి ప్రీ రిలీజ్ పెట్టడం అనేది కొత్త పద్దతికి నాంది పలకడమే. ఇప్పటికే సింహాద్రి రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. అయితే అభిమానులు నిర్వహిస్తున్న సింహాద్రి మూవీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు రాజమౌళి హాజరయ్యే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం రాకపోవచ్చని అంటున్నారు.