నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి కూసింత దూరమనేది జాగమెరిగిన సత్యమే. ఎప్పుడు కలుస్తారో ఎందుకు విడిపోతారో ఎవ్వరికి తెలియదు. బాలకృష్ణ అయితే మరీను. అన్న హరికృష్ణ సంతానమే అయినా ఆయన తారక్ ని ఒప్పుకోడు అనే విషయం తారకరత్న మరణంతో మరోసారి స్పష్టమైంది. అటు ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీతో డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తాడు. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తాతగారి శతజయంతి ఉత్సవాలకు హాజరవుతాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలకో చక్కర్లు కొట్టింది. నందమూరి ఫ్యామిలీ, నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఆ ఈవెంట్ లో తారక్ ఉంటే ఆ సందడే వేరు.
ఫ్యామిలీ ఇష్యుస్ మధ్యలో తారక్ ఆ ఈవెంట్ కి వస్తాడా, అసలు నందమూరి ఫ్యామిలీ ఆహ్వానం ఉంటుందా ఇలా రకరకాల ఆలోచనలు. కానీ నందమూరి కుటుంబం తరపున నందమూరి రామకృష్ణ, TD జనార్దన్ లు ఈ నెల 20 అంటే మే 20 న హైదరాబాద్ లో జరగబోయే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనమని ఎన్టీఆర్ కి ఆహ్వానం అందించారు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. అదే రోజు తాతగారి శతజయంతి ఉత్సవాల ఈవెంట్.
ఇప్పటివరకు ఆహ్వానం అందుతుందా అని ఆలోచించినవారు ఇప్పుడు ఆహ్వానం అందించినా ఎన్టీఆర్ ఆ సభకి వెళతాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆరోజు ఎన్టీఆర్డే బర్త్ డే. అలాగే బాబాయ్ మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు కదా అని.. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ ని లైట్ తీసుకుంటే నందమూరి అభిమానులు ఫీలవుతారు, కాదు పిలిచారు అని వెళితే ఎన్టీఆర్ ఫాన్స్ ఫీలవుతారు. ఎప్పుడూ పట్టించుకోని వారికి ఈ రోజు కావాల్సి వచ్చిందా అంటారు. మరి ఎన్టీఆర్ మే 20 తాతగారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారో, లేదో.. అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.