మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ వారంలో డెడ్ పిక్సల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. చైతన్య కి విడాకులు ఇచ్చేసింది అనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే నిహారిక ధైర్యంగా మీడియాని ఫేస్ చేస్తూ తన వెబ్ సీరీస్ ని ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్, సోషల్ మీడియా నెగిటివిటీపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పని లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళే ట్రోల్స్ చేస్తారు. వాటిని తాను అస్సలు పట్టించుకోనంటుంది. అనవసరమైన వాళ్ళకి మనం అటెన్షన్ ఇస్తాము, ప్రతి చోట ఇడియట్స్ ఉంటారు. ఒకవేళ మనం వాళ్ళని పట్టించుకుంటే నా వెధవతనం వల్లే ఇంత అటెన్షన్ ఇస్తున్నారు అని మరింతగా రెచ్చిపోతారు. నేనయితే వాళ్ళని పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. నేనంటే ఇష్టపడే వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఖాళీ సమయాల్లో వాళ్లతో గడపడానికి ట్రై చేస్తాను.
ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి, పని పాటా లేని వాళ్ళ గురించి నేను మైండ్ పాడు చేసుకోను, అసలు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తాను, ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్ చూసాను. కానీ ఇప్పుడు వాటిని చదవడం మానేసాను. ఒకవేళ చదివితే హెల్త్ కూడా పాడైపోతుంది. వాటిని మనం చూడాల్సిన అవసరమే లేదు అంటూ తనపై జరిగే ట్రోలింగ్ ని ఎంతగా లైట్ తీసుకుంటుందో నిహారిక చెప్పుకొచ్చింది.