సమంత ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్, స్టార్ హీరోల మూవీస్, వెబ్ సీరీస్ లు అంటూ ఇంకా ఇంకా క్రేజీ గా కనిపిస్తుంది. యశోద, శాకుంతలం మూవీస్ తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషి మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సిటాడెల్ వెబ్ సీరిస్ తో నేషనల్ వైడ్ సత్తా చాటడానికి రెడీ అవుతుంది. కొన్నాళ్లుగా సమంత కి స్టార్ ఛాన్సెస్ రావు, యంగ్ హీరోలు అవకాశాలు ఇవ్వరనే అనుకున్నారు. కానీ ఇప్పుడో కుర్ర హీరో సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది.
డీజే టిల్లుతో క్రేజీ హీరోగా టర్న్ అయిన సిద్దు జొన్నలగడ్డతో నందిని రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించబోయే మూవీలో సమంత హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందట. సమంతకి జబర్దస్త్ డిసాస్టర్, ఓ బేబీ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి సమంతతో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులోనే సిద్దు సమంత తో కలిసి నటిస్తాడంటూ ఆ న్యూస్ సారాంశం.
అయితే ఇది ఇంకా కన్ ఫర్మ్ అవ్వని వార్తే. కానీ సమంతని అడిగితే మాత్రం ఆమె కాదనదు. ఎందుకంటే సమంత చాలా సెలక్టీవ్ గా, కొత్త కథలతో సినిమాలు చేస్తుంది. సో ఈ సినిమా చేసే అవకాశం అయితే లేకపోలేదు.