కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది, పిల్లలు కూడా పుట్టారు.. ఇకపై కాజల్ అగర్వాల్ సినిమాల్లో కనిపించకపోవచ్చని అందరూ అనుకున్నారు. కామ్ గా కరోనా సమయంలో ప్రేమించివాడిని పెళ్లాడిన కాజల్ అగర్వాల్ అదే సమయంలో ప్రెగ్నెంట్ అవడంతో నాగార్జున ద ఘోస్ట్ నుండి తప్పుకుంది. తర్వాత నీల్ కి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ బరువు తగ్గడంపై దృష్టి పెట్టి ముందే ఒప్పుకున్న ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్ళిపోయింది.
తాను ప్రెగ్నెంట్ సమయంలో బరువు పెరగడంపై చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేసారు, కాని నేను వాటిని పట్టించుకోలేదు, డెలివరీ తర్వాత ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కూడా అందరూ చెత్త చెత్త కామెంట్స్ చేసి నానారకాల మాటలన్నారు. కానీ వాటిని పట్టించుకుంటే నేను నా కొడుక్కి బంగారు భవిష్యత్తుని ఇవ్వలేనని అనుకుని.. నా కొడుకుని నా తల్లికి అప్పజెప్పి షూటింగ్స్ కి వెళుతున్నాను, నా కొడుకుకి దూరంగా ఉన్నప్ప్పుడు బాధనిపించినా పెద్దయ్యాక తాను అర్ధం చేసుకుంటాడని తెలుసు అంటూ కాజల్ ఎమోషనల్ అయ్యింది.
ఇక ప్రస్తుతం ఇండియన్ 2-బాలయ్య తో NBK108 షూటింగ్ చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూస్తే వావ్ అనకమానరు. బ్లాక్ మోడరన్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూనే మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం కాజల్ బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.