Advertisementt

పుష్ప 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది

Thu 18th May 2023 04:16 PM
fahadh faasil,r pushpa 2  పుష్ప 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది
The biggest update from Pushpa 2 has arrived పుష్ప 2 నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

నిన్నమొన్నటివరకు సైలెంట్ గా పుష్ప ద రూల్ షూటింగ్ చేస్తున్న సుకుమార్ ఈ రోజు గురువారం పుష్ప ద రూల్ నుండి బిగ్గెస్టు అప్ డేట్ మోసుకొచ్చారు. ఐటి దాడులతో అతలాకుతలమైన నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కొద్ది రోజుల్లపాటు పుష్ప ద రూల్ షూటింగ్ ని పక్కనబడేసారు. తర్వాత మళ్లీ పుష్ప షూటింగ్ మారేడుమిల్లు అడవుల్లో చిత్రీకరించారు. అల్లు అర్జున్ ఫహద్ ఫాసిల్ పై కీలక సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ అని చెప్పుకోవడమే కానీ ఇప్పటివరకు మేకర్స్ అప్ డేట్ ఇవ్వలేదు.

అల్లు అర్జున్ బర్త్ డే వీడియో తర్వాత పుష్ప టీమ్ నుండి ఎలాంటి సందడి లేదు. మరోపక్క ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా మోగిపోతుంటే అల్లు ఫాన్స్ ఉసూరుమంటూ చూసారు. తాజాగా ఫహద్ ఫాసిల్ కేరెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ పై కీలక షెడ్యూల్ పూర్తయినట్లుగా అప్ డేట్స్ ఇచ్చారు. ఈ రోజు ఒక చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు, ఇందులో ఫహద్ ఫాసిల్ సెట్‌లో తన పనిలో నిమగ్నమై ఉన్నారు. చిత్ర BTS స్టిల్‌లో ఫహద్ ఫాసిల్ మరియు దర్శకుడు సుకుమార్ పుష్ప-ది రూల్ సెట్స్‌లో ఒక సన్నివేశాన్ని చర్చిస్తున్నట్లు కనిపించారు.

ప్రతీకారంతో తిరిగొచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ పై కీలక షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయాన్ని తెలియజేసారు. అల్లు అర్జున్ విశ్వరూపం వేరే లెవల్లో ఉండబోతున్నట్లుగా పుష్ప ద రూల్ స్పెషల్ విడియోలోనే చూపించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్నారు.

The biggest update from Pushpa 2 has arrived:

Fahadh Faasil wraps up key schedule for Pushpa 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ