మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యతో విడిపోయింది అని సోషల్ మీడియా కన్ ఫర్మ్ చెయ్యడానికి గల కారణం.. వారిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడమే కాదు.. పెళ్లి ఫొటోస్ ని, వారిద్దరూ కలిసున్న ఫొటోస్ ని డిలేట్ చెయ్యడమే కారణం. అయితే నిహారిక-చైతన్య విడాకుల విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. అప్పటినుండి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపించినా ఈ మేటర్ పై మెగా ఫ్యామిలీ మౌనాన్నే పాటించింది.
నిహారిక ఇప్పడు డెడ్ పిక్సల్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన విడాకులపై సూటి ప్రశ్నలు ఎదురౌతున్నాయి. కానీ నిహారిక మాత్రం తనకి ఈ ప్రశ్నలపై స్పందించే ఉద్దేశ్యం లేదు అంటూ సున్నితంగా ఆ ప్రశ్నలని దాటవేస్తుంది. ఆ ప్రశ్నపై నిహారిక సమాధానం చెప్పడానికి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం చూసి నిజంగానే నిహారిక విడాకులు తీసుకుందేమో అని చాలామందికి మరోసారి అనుమాన పడేలా చేసింది.