ఈరోజు శుక్రవారం ఓటిటి ప్రేక్షకులు చాలామంది ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఏజెంట్ మూవీ అంతగా డిసాస్టర్ అవడానికి గల కారణాలేమిటో ఓటిటీలో చూసి జెడ్జ్మెంట్ చేద్దామనుకున్న ఆడియన్స్ కి ఏజెంట్ ఓటిటీ పార్ట్నర్ సోని లివ్ నిరాశనే మిగిల్చింది. ఏప్రిల్ 28 న భారీ అంచనాలు నడుమ విడుదలై ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయిన ఏజెంట్ మూవీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా ఏజెంట్ నిలిచింది.
అందరూ సురేందర్ రెడ్డి దర్శకత్వాన్ని తప్పుబట్టారు. అఖిల్ మరియు నిర్మాత కూడా సురేందర్ రెడ్డినే ఇండైరెక్ట్ గా బ్లేమ్ చేసారు. అయితే థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ ప్లాప్ అవడంతో మూడు వారాలకే అంటే మే 19 నే స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా సోని లివ్ ప్రకటించింది. కానీ ఈరోజు ఏజెంట్ స్ట్రీమింగ్ లోకి రాలేదు. ఏజెంట్ స్ట్రీమింగ్ ని వాయిదా వేసింది. కారణాలు తెలియరాలేదు కానీ.. ఏజెంట్ విడుదలై కేవలం 20 రోజులే అయ్యింది. అందుకే మరో వారం పాటు ఏజెంట్ స్ట్రీమింగ్ ని సోని లివ్ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది.
ఓటిటీ ఆడియన్స్, అలాగే అక్కినేని అభిమానులు మాత్రం కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఏజెంట్ ప్లాప్ కి ఏయే కారణాలు పోగయ్యాయో తెలుసుకుందామని ఎదురు చూసిన ఆడియన్స్ మరో వారం ఎదురు చూడాల్సి వస్తుంది.