మలయాళ కుట్టి మాళవిక మోహనన్ ఈమధ్యన చాలా క్రేజీగా కనిపిస్తుంది. కోలీవుడ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందాలు ఆరబోసే మాళవిక మోహనన్ కి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఓ ఛాన్స్ దొరికింది. మారుతీ-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. ముగురు హీరోయిన్స్ లో మాళవిక మోహనన్ ఒకరు. అయితే ప్రభాస్ తో మాళవిక జోడి కడుతున్న విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా మాళవిక మోహనన్ ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయంపై ఇండైరెక్ట్ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా #AskMalavika పేరుతొ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ప్రభాస్ తో సినిమా చేస్తున్న మాళవికాని ప్రభాస్ ఫాన్స్ One word about Prabhas Anna #AskMalavika అంటూ ప్రశ్నించారు. దానికి మాళవిక మోహనన్ కూడా ఛరిస్మాటిక్ అంటే ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ సింపుల్ గా సింగిల్ వర్డ్ లో ఆన్సర్ ఇచ్చింది. దానితో ప్రభాస్ ఫాన్స్ ఎగ్జైట్మెంట్ లోకి వెళ్లిపోతున్నారు.
ఇక మాళవిక మోహనన్ కి పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని జరిగిన ప్రచారానికి నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెయ్యడం లేదు, అందులోను సెకండ్ హీరోయిన్ గా అస్సలు కాదంటూ జవాబిచ్చింది. అలాగే నయనతార ఇష్యులోనూ మాళవిక మోహనన్ నయన్ అభిమానులతో తిట్టించుకుని సారి చెప్పిన విషయం తెలిసిందే.