Advertisementt

సైలెంట్ గా తప్పుకున్న ఎన్టీఆర్

Sat 20th May 2023 10:37 AM
jr ntr,ntr centenary celebrations  సైలెంట్ గా తప్పుకున్న ఎన్టీఆర్
Jr NTR Disappoints సైలెంట్ గా తప్పుకున్న ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా, కేక్ కటింగ్స్, ఆయన కొత్త చిత్రాల అప్ డేట్స్, ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాల రీ రిలీజ్ లతో హోరెత్తిపోతుంది. అయితే ఇదే రోజు సీనియర్ ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు KPHP గ్రౌండ్స్ లో నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ కూడా భాగమవుతాడు. 

ఇది ఫ్యామిలీ ఫంక్షన్.. అందులోను చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా వస్తున్నారు.. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ పది నిముషాలు ఉన్నా చాలా బావుంటుంది. నందమూరి అభిమానులకైతే పండగే అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఈ వేడుకకి రాకుండా తప్పించుకున్నాడు. కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ నుండి వినిపించిన కారణం మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ గారు 40వ జన్మదినోత్సవం జరుపుకోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా చేసుకున్న ఏర్పాట్ల వల్ల హాజరు కాలేకపోతున్నారని తెలియజేసేందుకు చింతిస్తున్నాము. 

ఆహ్వాన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ఇదే విషయాన్ని తెలియజేశారంటూ ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్వో మీడియాకి తెలియజేసారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్, నందమూరి ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కావాలనే ఈ వేడుకకి దూరంగా ఉన్నాడు, ఆయనని బాలకృష్ణ కాస్త దూరం పెడుతున్న కారణంగానే ఎన్టీఆర్ ఇలా సైలెంట్ గా పుట్టిన రోజు వేడుక అంటూ సైడ్ అయ్యాడంటున్నారు.

ఏది ఏమైనా కనీసం ఓ పది నిమిషాలైనా ఎన్టీఆర్ తన తాతగారి శతజయంతి ఉత్సవాల్లో భాగమైతే బావుండేది అంటూ చాలామంది కోరుకుంటున్నారు.

Jr NTR Disappoints:

Jr NTR not attending NTR Centenary Celebrations 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ