ఎన్టీఆర్ అభిమానుల హడావిడి, సెలబ్రిటీస్ ఎన్టీఆర్ కి చెబుతున్న బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్ తో ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ఆక్యుపై చేసింది. సోషల్ మీడియాలో #NTR30, #NTR31, #HBDNTR, #Devara హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ భీబత్సమైన హంగామా చేస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ బర్త్ డే కి ఒకేరోజు ముందే ఆయన లేటెస్ట్ చిత్రం దేవర నుండి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రివీల్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.
ఇప్పుడు #NTR31 నుండి పవర్ ఫుల్ అప్ డేట్ ఆడించారు. కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే #NTR31 నుండి గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే కి అదిరిపోయే పవర్ ఫుల్ లుక్ లో పవర్ హౌస్ అంటూ మాస్ లుక్ ని రివీల్ చేసిన మేకర్స్ ఈసారి.. #NTR31 మొదలు కాబోయే సమయాన్ని రివీల్ చేసారు. Team #NTR31 wishes @tarak9999 a very Happy Birthday 🔥🔥 On to the sets from March 2024 💥💥 #HappyBirthdayNTR #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial .. వచ్చే ఏడాది మార్చ్ లో #NTR31 సెట్స్ మీదకి వెళుతుంది అంటూ ఎన్టీఆర్ బర్త్ డే కి విషెస్ అందించారు.
దానితో ఎన్టీఆర్ ఫాన్స్ అటు #NTR30 లుక్, ఇటు #NTR31 అప్ డేట్, సింహాద్రి రీ రిలీజ్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.