హీరో అడివి శేష్ రిలేషన్ లో ఉన్నానంటూ గతంలో చెప్పినా.. అతను ఎవరితో రిలేషన్ లో ఉన్నాడో అనేది మాత్రం చెప్పలేదు. ఇక త్వరలోనే పెళ్లి అన్నప్పటికీ ఇంతవరకు దానిపై శేష్ క్లారిటీ ఇవ్వలేదు. ఈమధ్యలో అడివి శేష్ గూఢచారి సినిమా తర్వాత నాగార్జున మేనకోడలు నటి సుప్రియతో డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సుప్రియతో ఫ్రెండ్ షిప్ ఉంది అన్నప్పటికీ.. అక్కినేని ఫ్యామిలీ పార్టీస్ లో కలిసి కనిపిస్తారు. ఏదైనా పార్టీకి వెళితే కలిసే వెళతారు.
మా మధ్యన ఏమి లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటారు. మరి నెటిజెన్స్ మాత్రం వారిద్దరూ లవర్స్ అంటారు. ఏది నిజమో, ఏది అబద్దమో కానీ.. ఇప్పుడు మాత్రం అడివి శేష్ సుప్రియతో పెళ్ళికి సిద్దమవుతున్నాడనే న్యూస్ చూసి ఆయన అభిమానులు కంగుతింటున్నారు. సుప్రియని పెళ్లి చేసుకుంటావా అని శేష్ ని డైరెక్ట్ గానే అడుగుతున్నారు. ప్రస్తుతం సుప్రియ-అడివి శేష్ పెళ్లి వార్త నెట్టింట సంచలనంగా మారింది.
వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. త్వరలోనే శేష్-సుప్రియ పెళ్లి వార్త అధికారికంగా బయటికొచ్చేస్తుంది అంటున్నారు. ఇక సుప్రియ గూఢచారి తర్వాత మరే ఇతర సినిమాలో నటించలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చక్కబెడుతుంది. అడివి శేష్ గూఢచారి 2 షూటింగ్ లో బిజీగా వున్నాడు.