Advertisementt

తెగ ఫీలైపోతున్న తమన్నా

Sun 21st May 2023 01:32 PM
tamannaah bhatia,nbk108  తెగ ఫీలైపోతున్న తమన్నా
Tamannaah clears rumors about NBK108 special song తెగ ఫీలైపోతున్న తమన్నా
Advertisement
Ads by CJ

ఈమధ్యన తమన్నాకి డిమాండ్ బాగా తగ్గింది. గతంలో వరస సినిమా అవకాశాలతో దూసుకుపోయిన మిల్కి బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. F3 లాంటి హిట్ ఉన్నప్పటికీ తమన్నాకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. తెలుగులో మెగాస్టార్ చిరూతో భోళా శంకర్, తమిళంలో రజినీకాంత్ జైలర్ మూవీలో నటిస్తున్న తమన్నాకి బాలయ్య NBK108 లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. తమన్నాతో ఉన్న స్నేహంతో అనిల్ రావిపూడి తమన్నాని సంప్రదించాడనే న్యూస్ నడిచింది.

కానీ తమన్నా బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు కోటిన్నర డిమాండ్ చెయ్యగా తమన్నాని తప్పించి మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి వెతుకుతున్నారనే టాక్ కూడా స్ప్రెడ్ అవడంతో బాగా ఫీలైన తమన్నా సోషల్ మీడియా వేదికగా ఈ రూమర్స్ పై ఎమోషనల్ అయ్యింది. నాకు అనిల్ రావిపూడి తో వర్క్ చెయ్యడం చాలా ఇష్టం. నందమూరి బాలకృష్ణ గారంటే నాకు ఎంతో గౌరవం. అనిల్ రావిపూడితో, బాలకృష్ణ గారి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ఎలాంటి అధరాలు లేకుండా నా గురించి ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం నన్నెంతో బాధించింది. ఇలాంటి రూమర్స్ రాసేముందు రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అప్పుడే రాయండి అంటూ సోషల్ మీడియా వేదికగా తమన్నా NBK108 స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చింది. 

Tamannaah clears rumors about NBK108 special song:

Tamannaah Bhatia Denies Rumors About Special Song In NBK108

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ