నరేష్-పవిత్ర లోకేష్ మళ్ళీ పెళ్ళేమో కానీ.. ప్రస్తుతం వారు నటించిన మళ్ళీ పెళ్లి కోసం ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూడలేక చేస్తున్నారు జనాలు. వారి లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మళ్ళీ పెళ్లి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ నరేష్-పవిత్రలు హడావిడి చెయ్యడమే కాదు.. బుల్లితెర షోస్ కి గెస్ట్ లువస్తూ రొమాన్స్ చేస్తున్నారు. ఓం కార్ షో Sixth సెన్స్ లో అయితే నరేష్ కుర్ర హీరోలా మారిపోయి పవిత్ర లోకేష్ తో కళావతి పాటకి డాన్స్ చేస్తూ పాటేసుకున్నాడు.
అంతేకాదు ప్రేమగా అమ్ములు, అమ్ము అంటూ పిలుస్తాను అని ముద్దులతో ముంచెత్తాడు. అటు పవిత్ర లోకేష్ కూడా నరేష్ కి ముద్దులు పెట్టేసింది. తన ప్రాణం ఉన్నంత వరకు పవిత్ర చెయ్యి వదలను అంటూ నరేష్ చేసిన యాక్షన్ కి నెటిజెన్స్ షాకవుతున్నారు. మరో పక్క నరేష్ ఏంటిలా ఈ వయసులో రెచ్చిపోతున్నాడు.. ఎవరినో ఉడికించడానికి ఇలా చేస్తున్నాడా.. అసలు వీరి రొమాన్స్ చూడలేక చేస్తున్నామంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.