ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇంకా ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకు చచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ కి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయంటే.. కాదు ఎన్టీఆర్ సింహాద్రికే రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయంటూ కొట్టుకోడమే మిగిలింది అన్న రేంజ్ లో తగువు పడుతున్నారు. మీవి ఫేక్ కలెక్షన్స్ అంటే మీవి ఫేక్ కలెక్షన్స్ అంటూ అబ్బో సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ, వారు తిట్టుకునే తిట్లు సామాన్యులకి చిరాకు తెప్పిస్తున్నాయి.
ఫాన్స్ కష్టపడి సింహాద్రి4K మూవీని ఎంతో హంగామా మధ్యన రీ రిలీజ్ చేసారు. 1000 థియేటర్స్ లో ఎన్టీఆర్ ఫాన్స్ సింహాద్రిని రీ రిలీజ్ చేసుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరోలని పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. అయితే ఇదంతా ఎన్టీఆర్ ఫాన్స్ కావాలని చేసింది కాదు.. ఎన్టీఆర్ వెనకుండి అభిమానులకి ఇచ్చిన ఇనస్ట్రక్షన్స్ తోనే సింహాద్రి రీ రిలీజ్ చేసి నెల రోజులుగా ఇంత హంగామా చేసారు.. ఇది ఓ హిట్టేనా, ఇది ఓ రికార్డేనా అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సింహాద్రి కలెక్షన్స్ ని అవమానిస్తున్నారు.
ఖుషి ని 4K లో రిలీజ్ చేసారు అంటే.. అది వేరే లెవల్. పవన్ కళ్యాణ్ క్రేజ్ తో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది అది. పవన్ అభిమానులు ఖుషి రిలీజ్ ని భుజాన మోశారు. అది పవన్ ఫాన్స్ లెవల్ అంటూ పవన్ ఫాన్స్ రెచ్చిపోతున్నారు. సింహాద్రి భారీ హిట్ అయినా.. దానికి భారీ బడ్జెట్ అవడంతో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది.. ఇప్పుడు రీ రిలీజ్ కి కూడా ఎన్టీఆర్ కొంతమొత్తాన్ని వెచ్చించి మరీ రీ రిలీజ్ కి ఖర్చు పెట్టారంటూ పవన్ ఫాన్స్ ఎన్టీఆర్ ఫాన్స్ ని తీవ్రంగా అవమానిస్తున్నారు.
పవన్ ఫాన్స్ మాత్రమే కాదు.. కొంతమంది యాంటీ జర్నలిస్టులు కూడా ఎన్టీఆర్ సింహాద్రి కలెక్షన్స్ పై పడి ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి 4K కలెక్షన్స్ ఒరిజినల్.. సింహాద్రి 4K కలెక్షన్స్ అంటూ సోషల్లో మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.
ఇదంతా చూసిన ఎన్టీఆర్ ఫాన్స్.. చందా నువ్వు కట్టించుకున్నావ్ ఏంట్రా? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం ఉండేది. ఫిల్మ్ జర్నలిస్టు అంటే బ్రోకర్ నా కొడుకులకన్నా దారుణం అయిపోయింది. డబ్బు కోసం హిట్ ని ప్లాప్ చేస్తారు, ప్లాప్ ని హిట్ చేస్తారు. నువ్వు అన్న మాట అన్న ఇండస్ట్రీ పెద్దల పేర్లు కూడా చెప్పు!! అంటూ ఆ యాంటీ జర్నలిస్ట్ లని ఎన్టీఆర్ ఫాన్స్ ఏసుకుంటున్నారు.