ఖిలాడీ, రామ బాణం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిసాస్టర్ కొట్టిన తెలుగు హీరోయిన్ డింపుల్ హయ్యతిపై క్రిమినల్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ లోని తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉంటున్న ఐపీఎస్ అధికారి కారుని ఉద్దేశ్య పూర్వకంగా గుద్దింది అన్న విషయమై ఆ ఐపీఎస్ అధికారి డింపుల్ పై ఫిర్యాదు చెయ్యగా.. పోలీస్ లు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసారు.
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని SKR అపార్ట్మెంట్ లో సదరు ఐపీఎస్ అధికారి నివాసముంటున్నారు. అదే పార్ట్మెంట్ లో డింపుల్ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్ తో కలిసి ఉంటున్న సందర్భంలో ఐపీఎస్ అధికారికి, డింపుల్ ఆమె స్నేహితుడికి మధ్యన కార్ పార్కింగ్ విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవట. డింపుల్ ఆమె ఫ్రెండ్ డేవిడ్ ఐపీఎస్ అధికారితో గొడవకు దిగడమే కాకుండా వీరంగం చేస్తూ ఉండేవారట.
తాజాగా డింపుల్ ఆ ఐపీఎస్ అధికారి కారుని కావాలని ఢీ కొట్టడమే కాకుండా ఇదేమిటి అని ప్రశ్నించిన డ్రైవర్ పై గొడవకు దిగి నానా రచ్చ చెయ్యడంతో సదరు ఆఫీసర్ డింపుల్ మరియు ఆమె స్నేహితుడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్ ఆమె ఫ్రెండ్ డేవిడ్ పై క్రిమినల్ కేసు బుక్ చేసినట్లుగా తెలుస్తుంది.