Advertisementt

ఇంట్రెస్టింగ్: చిరు లీక్స్

Tue 23rd May 2023 06:26 PM
bhola shankar  ఇంట్రెస్టింగ్: చిరు లీక్స్
Interesting: Chiru leaks ఇంట్రెస్టింగ్: చిరు లీక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత మొహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్నారు. తమిళ వేదళానికి రీమేక్ అయినా.. భోళా శంకర్ పై భారీ క్రేజ్ ఉంది. చిరుకి సిస్టర్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్ గా మెగాస్టార్ తో జోడి కడుతుంది. తాజాగా భోళా శంకర్ నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అది కూడా చిరు లీక్స్ అంటూ కాస్త ఇంట్రెస్టింగ్ గా భోళా శంకర్ అప్ డేట్ ని మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు.

స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song  Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది!  ఈ  పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు  పంచుకుందాం ! అప్పటివరకూ ఈ చిరు లీక్స్ పిక్స్  😜  మెగాస్టార్ సరదాగా కొన్ని పిక్స్ లీక్ చేసి చిరు లీక్స్ అంటూ కన్ను కొట్టే ఎమోజిని షేర్ చేసారు.

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఓ సాంగ్ షూట్ ని విజయవంతం గా కంప్లీట్ చేసి వచ్చామని.. కానీ అక్కడ షూట్ వాతావరణం లో కాస్త కష్టతరంగానే అనిపించింది అంటూ దర్శకుడు మెహర్ కూడా కొన్ని పిక్స్ షేర్ చేసాడు.

Interesting: Chiru leaks :

Bhola Shankar returns from Switzerland

Tags:   BHOLA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ