Advertisementt

పొన్నియన్ సెల్వన్ 2 ఓటిటీ రాక ఫిక్స్

Wed 24th May 2023 10:15 AM
ponniyin selvan 2  పొన్నియన్ సెల్వన్ 2 ఓటిటీ రాక ఫిక్స్
Ponniyin Selvan 2 to have an OTT premiere on THIS date పొన్నియన్ సెల్వన్ 2 ఓటిటీ రాక ఫిక్స్
Advertisement
Ads by CJ

టాప్ డైరెక్టర్ మణిరత్నం కోలీవుడ్ లో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్, రెండో పార్ట్ తమిళ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోగా.. ప్యాన్ ఇండియా ఫిలింగా విడుదలైన ఈ చిత్రం మిగతా భాషల్లో యావరేజ్ గా నిలిచింది. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి, శోభిత, ఐశ్వర్య లక్ష్మి నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 ఓటిటీ రిలీజ్ పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.,

ఈ సినిమాను భారీ ధరకు ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రైట్స్ ను అమెజాన్ దాదాపుగా120 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. అమెజాన్ ప్రైమ్ వారు కొంతకాలంగా పెద్ద సినిమాలని రెంట్ రూపంలో అనుకున్న తేదీ కన్నా ముందే ఓటిటీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే రెంట్ విధానంలో మే 26 నుంచి తెలుగు, తమిళ భాషల్లోకి పొన్నియన్ సెల్వన్ 2 అందుబాటులోకి రానుందని సమాచారం. 

మరొక నెల తర్వాత అంటే జూన్ 28 నుంచి పొన్నియన్ సెల్వన్ 2 ని ఫ్రీగా చూసే వెసులుబాటును కల్పించారు అమెజాన్ ప్రైమ్ వారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Ponniyin Selvan 2 to have an OTT premiere on THIS date:

PS 2 OTT Release date locked

Tags:   PONNIYIN SELVAN 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ