Advertisementt

రవితేజకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Wed 24th May 2023 11:10 AM
ravi teja to,ravanasura  రవితేజకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Hats Off to Ravi Teja! రవితేజకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Advertisement
Ads by CJ

రవితేజ వరస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో. క్రాక్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ తో బిగ్గెస్ట్ డిసాస్టర్ చవిచూశాడు. ఆతరవాత ధమాకా రవితేజని సేవ్ చేసింది. ఆ వెంటనే వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ చిరు మళ్ళీ రవితేజని ఆదుకున్నారు. కానీ రావణాసుర రూపంలో రవితేజని మరో డిసాస్టర్ పలకరించింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో లాయర్ గా రవితేజ కనిపించిన ఈమూవీని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు.

అయితే రావణాసుర మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. ఆ సినిమాకి స్ప్రెడ్ అయిన ఆడియన్స్ ఒపీనియన్, క్రిటిక్స్ రివ్యూస్ తో రెండో రోజే రావణాసుర కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఫైనల్ గా రావణాసురకి డిజాస్టర్స్ కలెక్షన్స్ రావడంతో బయ్యర్లు చాలా లాస్ అయ్యారు. రవితేజ రావణాసురకి వన్ అఫ్ ద నిర్మాత కూడా. అందుకే రవితేజ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 

ఈ సినిమా కారణంగా నష్టపోయిన బయ్యర్లకు ఆ నష్టాలను సెటిల్ చేసి రవితేజ వారికి అండగా నిలబడినట్టుగా టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో రవితేజ రావణాసుర బయ్యర్లకి హెల్ప్ చేసాడనే న్యూస్ స్ప్రెడ్ అవడంతో.. అందరూ రవితేజ డెసిషన్ ని అప్రిషెట్ చేస్తున్నారు. ఇదే నిజం అయితే రవితేజ గ్రేట్ అని చెప్పాలి. ప్రెజెంట్ రవితేజ భారీ పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరావు లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

Hats Off to Ravi Teja!:

Ravi Teja to compensate the losses of Ravanasura to buyers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ