Advertisementt

ఈ హైప్ తేవడం మాములు విషయం కాదు

Wed 24th May 2023 12:24 PM
naresh,pavitra lokesh,malli pelli  ఈ హైప్ తేవడం మాములు విషయం కాదు
Crazy promotions on Malli Pelli ఈ హైప్ తేవడం మాములు విషయం కాదు
Advertisement
Ads by CJ

ఈ మధ్యన సినిమా చెయ్యడం ఒక ఎత్తు ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అనేలా ఉంది పరిస్థితి. చిన్న సినిమాలైతే రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ ని బట్టి ఆడేస్తున్నాయి. కానీ టాక్ తేడా కొడితే రెండో రోజే దుకాణం సర్దేయ్యాల్సి వస్తుంది. అది చిన్న హీరోనే కాదు, మీడియం రేంజ్, స్టార్ హీరోల పరిస్థితి అలానే ఉంది. అసలు ప్రేక్షకులని ఏ విధంగా ఇంప్రెస్స్ చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారో అని చాలామంది చాలా రకాలుగా కొత్తగా ట్రై చేస్తున్నారు.

ఈ సందర్భంలో నరేష్-పవిత్ర లోకేష్ లాంటి సీనియర్ నటులు నటిస్తే ఎవరైనా థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉందా.. లేదు, రారు. కానీ నరేష్-పవిత్ర లోకేష్ మళ్ళీ పెళ్లిపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు.. సాధారణ మూవీ లవర్స్ లోను క్రేజ్ కనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ సినిమా చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి.. పవిత్రతో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్నాడు. అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ వారి ప్రేమకి-పెళ్ళికి మధ్యన పెద్ద హై డ్రామా నడుస్తుంది.

దానినే నరేష్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడానికి పబ్లిక్ గా ఈ జంట రొమాన్స్ చేస్తుంది. పవిత్రతో ముద్దులు, హగ్గులు, ఐ లవ్ యు చెప్పడాలు.. ఇలా అన్ని కుర్ర వేషాలే. ఇక యంగ్ హీరోయిన్స్ కూడా ఇంత యాక్టీవ్ గా ఉండరేమో అనేలా పవిత్ర ప్రవర్తన. ఇద్దరూ కలిసి ఇంటర్వూస్ ఇవ్వడం, పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేస్తూ మళ్ళీ పెళ్లిపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. 

మధ్యలో మహేష్ ఫ్యామిలీ మా బంధాన్ని యాక్సెప్ట్ చేసారంటూ మహేష్ ఫాన్స్ ని బుట్టలో వెయ్యడం. ప్రస్తుతం నరేష్-పవిత్ర మళ్ళీ పెళ్లిపై ఉన్న క్రేజ్ చూస్తే హమ్మా నరేష్ నువ్వు మాములోడివి కావు. సినిమా కోసం ఏమైనా చేసేలా ఉన్నావ్ అంటూ నెటిజెన్స్ గుసగుసలాడుతున్నారు.

Crazy promotions on Malli Pelli:

Naresh-Pavitra Lokesh Malli Pelli promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ